Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీిఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప నాయకుడని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కోరికను సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ జి. రవీందర్, వైస్ చైర్మెన్ జి.నాగరాజు, మున్సిపల్ చైర్మెన్ వి .శంకరయ్య ,పీఏసీఎస్ చైర్మెన్ మల్లేష్, వైస్ చైర్మెన్ సిహెచ్.చంద్రకళ మురహరి,నాయకులు రాములు , వెంకటేష్ పాల్గొన్నారు.