Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ సేవలో కీలకపాత్ర పోషించాలని శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ 67వ జన్మదినం పురస్కరించుకుని ఆయన జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి రోడ్డులో గల లెప్రసీ హెల్త్ సెంటర్లో దివంగత గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రోగులకు, విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆరోగ్యంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి సేవలు అందించడమే కాకుండా అవసరం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఆ తరువాత దేశానికి కూడా సేవలు అందించాలని ఆయన అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కొట్లాడి సాధించిన తెంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా, సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన అలుపెరుగని కృషివలుడు మన కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందాడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్ పాల్గొన్నారు.