Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో మంగళవారం దేవురి శేషగిరిరావు 74వ వర్ధంతిని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేశ్ మాట్లాడుతూ.. శేషగిరిరావు సేవలు మరువలేనివని, ఆయన జీవితం కార్మికులకుమార్గదర్శకమని అన్నారు. కార్మికవర్గం కోసం త్యాగం చేసిన మహానేతని కొనియాడారు. కార్మికుల హక్కుల కోసం మహౌన్నత పోరాటాలు జరిపిన త్యాగశీలని గుర్తు చేశారు. అనంతరం ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పూరెల్ల శ్రీనివాస్, జి. రాజేశ్వర్ , జి. మురళి, ఏ .శంకర్, బి. శ్రీనివాస్, కరుణాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.