Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్ పహాడ్
రైతులకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు సహకార సొసెటీ వద్ద యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొలం యూరియా దశకు వచ్చినా యూరియా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను అమ్మడం ఒక బాధ అయితే యూరియా కొరత మరో ఇబ్బందని వాపోయారు. ఇదిలా ఉండగా ఫెస్టిసైడ్స్ షాపుల వాళ్ళు మాత్రం ఇదే అదనుగా భావించి ఒక యూరియా బస్తాకు 350 రూపాయలు వసూలు చేస్తున్నారని, అధికారులు ఫెస్టిసైడ్స్ దుకాణాలపై చర్యలు తీసుకోకుండా దుకాణ యజమానులకు కొమ్ము కాస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు.