Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట:తెలంగాణ రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం రోజునే రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని టెస్కాబ్ వైస్ చైర్మెన్, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు.గురువారం మండలంలోని వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలతోపాటు ట్యాంకర్లు, కూడా అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు కేసీఆర్ నాయకత్వంలో సగర్వంగా తలెత్తుకునే విధంగా అభివద్ధి చెందుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వంగపల్లి పీిఏస్ఏస్ పరిధిలోని రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ , టీిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కార్రే వెంకటయ్య, జెడ్పీటీసీి అనురాధ , ఎంపీటీసీ మౌనిక, ఉప సర్పంచ్ రేపాక స్వామి, నాయకులు భూమయ్య పాండు శ్రీశైలం పాల్గొన్నారు.