Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్
నవతెలంగాణ- రామన్నపేట
న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యకు గురై ఏడాది అవుతున్నా ప్రభుత్వం న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నల్ల బ్యాడ్జీలతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వామనరావు దంపతుల హత్యచేసిన హంతకులను శిక్షించక పోవడం అత్యంత బాధాకరమన్నారు. న్యాయవాదుల పై తరుచూ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ తరుపున ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. న్యాయవాదల పై జరుగుతున్న దాడుల దష్ట్యా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కంపాటి యాదగిరి, బొడిగే లక్ష్మయ్య, హనుమంత్ గౌడ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మోగులయ్య సహాయ కార్యదర్శి గాలి లింగయ్య, కోశాధకారి సంగిశెట్టి బాలరాజు, న్యాయవాదులు బాతరాజు అశోక్, జగతయ, శ్రీశైలం, నోముల స్వామి, దినేష్, మామిడి వెంకట్ రెడ్డి, సుక్క శ్రావణ కుమార్ తదితులు పాల్గొన్నారు.