Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరిరూరల్/వలిగొండ
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం వలిగొండ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను గౌరవించాల్సిన సీఎం అక్రమంగా అరెస్టు చేస్తూ, తన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని, ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, కాంగ్రెస్ నాయకులు వాకిటి అనంత రెడ్డి, నాయకులు బోళ్ళ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, సహదేవ్, బాల నరసింహ, రామ్ రెడ్డి, కొమురయ్య, గార్ల రవి,కాసుల వెంకన్న, వరుణ్, ప్రవీణ్ , నగేష్ పాల్గొన్నారు.