Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం రాజు కోరారు. గురువారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాలకు సారధ్యం వహించి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఈ మహాసభలు భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలను రూపొందిస్తామన్నారు ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా 350 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వేముల నాగరాజు, బుగ్గ ఉదరు ,కిరణ్, సంధ్య, రమేష్, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు .