Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ సునీతమహేందర్‌రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి కెేసీిఆర్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై అభాండాలు వేస్తున్నారని ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఉంటే మాట్లాడాలన్నారు. లేనిపోని అభాండాలు వేస్తూ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురద జల్లడం సరికాదన్నారు. ఓర్వలేని తనంతో ,కడుపుమంటతో కేసీఆర్ జన్మదినంపై మాట్లాడొద్దన్నారు. ప్రజలు సంతోషంతో జన్మదినం పండుగలా చేసుకుంటున్నారన్నారు. ,ప్రజలు రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారని,అన్నదాన కార్యక్రమం, ఆస్పత్రులలో పండ్ల పంపిణీ , పేదలకు బెడ్‌షీట్స్ ,బ్లాంకెట్స్ పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని , ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. పండగ అంటే రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని విమర్శిస్తే రేవంత్‌రెడ్డి నోరుమెదపలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, నాయకులు ఆడేపు, బాలస్వామి, మొరిగాడి వెంకటేష్, మాదని ఫిలిప్, భేతి రాములు, దాసి సంతోష్, శివ మల్లు పాల్గొన్నారు.