Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను లౌకిక శక్తులు వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మత విధ్వంసాలను సష్టించి అల్లర్లను రేపుతున్నారని విమర్శించారు. యూపీలో రాజకీయ లబ్ది పొందాలని దురుద్దేశంతో హిజాబ్ సమస్యను సష్టించి ముస్లింలను విద్యకు దూరం చేస్తున్నట్టు విమర్శించారు. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోను లోపాలను కప్పిపుచ్చుకునేందుకే మతోన్మాదం చర్యలకు పూనుకుంటున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లౌకిక వాదులు అందరూ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, మండల కార్యదర్శి దొడ్డ యాదిరెడ్డి, నాయకులు దోనూరి నిర్మల ,రాచకొండ కష్ణ, రావిరాల మల్లేష్, ఉప్పల పల్లి బాలకష్ణ, మల్లె పెళ్లి లలిత, సురకంటి రంగారెడ్డి, కడ్తాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.