Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్ టౌన్
పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన గోదాం నిర్మాణానికి గురువారం శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సేవలు అందించేందుకు గాను సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ ఛైర్మెన్ జక్కుల నాగేశ్వర్రావు, కౌన్సిలర్ లు దొంగరి మంగమ్మ, యరగాని గురవయ్య, కెఎల్ఎన్ రావు, రాంగోపి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీ యరగాని శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీ కంచెర్ల మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.