Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మిర్యాలగూడ
బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజక వర్గ స్థాయిలో ఈ నెల 19 ,20 వతేదీల్లో వివాహాలు జరుపుకుంటున్న పేదింటి ఆడపడుచులకు 72 మందికి శ్రీ శ్రీనివాస కల్యాణ శుభమస్తు కార్యక్రమంలో భాగంగా మ్యారేజ్ కిట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివాహం చేసుకునే పేదింటి ఆడపడుచులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి వివాహానికి వచ్చేటటువంటి అతిధులకు ఏలాంటి ఇబ్బంది జరగకుండా ఉండటానికి ఈ వివాహ కానుకను ఇస్తున్నామని తెలిఆపరు. దీనికి కొంత మంది రాజకీయ నాయకులు కొన్ని గ్రామాలలో రాజకీయ రంగు పులిమి వివాహం చేసుకునే ఆడపడుచులను మ్యారేజ్ కిట్టు తీసుకోవద్దని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందన్నారు. తాము కులమతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికీి ఈ మ్యారేజ్ కిట్టు అందేలా చూడాలని దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిఆపరు. నెంబర్ 92 97 55555 వాట్సాప్ మెసేజ్ పెట్టిన వెంటనే వారి పేరును నమోదు చేసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ వారి వివాహానికి వారం రోజుల ముందుగానే పెళ్లి కార్డును వాట్స్అప్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.