Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా గ్రామాల్లో రుణాలు పొంది తిరిగి చెల్లించిన డబ్బులు స్త్రీనిధికి జమకావడం లేదు. ప్రతి నెలా 17వ తేదీన 62 సంఘాలకు చెందిన సభ్యులు రుణాలు చెల్లిస్తున్నా స్త్రీనిధికి పంపించడం లేదు. ఏపీఎం, వీఏఓల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏపీఎంను రమన్నా మహిళ సంఘం సభ్యులు లీడర్లు ఉన్న చోటుకి రాకుండా నిర్లక్ష్యం వభహిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మూడు నెలల నుంచి వబ్బులు జమ చేయడం లేదని, ఈ నెల కూడా చెల్లించలేదని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఓ సభ్యురాలు మాట్లాడుతూ తాము ప్రతి నెలా రుణం చెల్లించుకుంటూ వస్తున్నా ఎందుకు స్త్రీనిధిలో జయ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంత వరకు తాము ఈ నెల స్త్రీనిధి చెల్లించమని వెళ్లిపోయారు.
డబ్బులు జమకావడం లేదు
మహేంద్రకుమార్, ఆర్ఎం
అర్వపల్లికి చెందిన 62 మహిళ సంఘాల స్త్రీనిధి డబ్బులు జమకావడం లేదన్నారు. లోను తీసుకున్నవారి డిఫాల్ట్ కావడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం వచ్చానన్నారు. ఏపీఎం రెండు గంటలపాటు ఉన్నా ఫోన్ చేసినా రాలేదన్నారు. పూర్తి నివేధికను, మహిళా సభ్యులు తెలియజేసిన వివరాలను జిల్లా అధికారులకు తెలియజేస్తానన్నారు.