Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సెర్ఫ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిం చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సెర్ఫ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ .శేఖర్ రెడ్డిలను కలసి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కూడా మాట్లాడతామని, లెటర్ కూడా పంపిస్తామని రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సెర్ప్(ఐ.కె.పి) ఉద్యోగుల నాయకులు జానీ, మల్లేశ్, యాదగిరి, సత్యనారాయణ, మీనా, అప్సర్ బీ, గౌరిశంకర్, బాలనర్సయ్య లు పాల్గొన్నారు.