Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు
నవతెలంగాణ - భువనగిరి
వీఆర్ఏలకు పేస్కెల్ జీవోను వెంటనే విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 22న ఇందిరా పార్కు వద్ద వేలాది మందితో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్విహాల్లో నిర్వహించిన వీఆర్ఏల సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 సెప్టెంబర్ 9న శాసన సభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓ లను రద్దు చేసి, వీఆర్ఏలకు పేస్కెల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్ ఇస్తామని,వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాపితంగా 22న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నాలో వీఆర్ఎ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం చలో ఇందిరా పార్క్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం, రాష్ట్ర నాయకురాలు కైరంకొండ బాలమణి, నాయకులు బోళ్ల బాషయ్య, గిరి రావు, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పసుల రమేష్, చింతల పెంటయ్య, గడ్డం శ్రీనివాస్, కోట నర్సింహ, సైదులు, మైలారం కష్ణ, సంతోష్ ,శ్రీనివాస్, బోయిన నర్సింహ, నాయకులు ధనలక్ష్మి, మాధవి,సాయి, బింగి శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.