Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దళిత బంధు పధకం దేశానికే ఆదర్శం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా దీనితో దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టొచ్చని ఆయన చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన తెలిపారు. గురువారం స్థానిక ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ టి. వినరు కృష్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహనా సదస్సు కార్యక్రమంలో ఎంపీ రాజ్య సభ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్ నగర్ శానంపుడి సైదిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ దళిత భాందవుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ సాధించుకున్నాక అన్ని వర్గాల ప్రజల అవసరాలను పరిగాణలోకు తీసుకొని రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారుల జీవితంలో గొప్ప సువర్ణ అవకాశమని, ఈ పధకం ద్వారా దళిత సోదరుల జీవితంలో ఆర్ధిక బలోపేతం తో పాటు విప్లవాత్మక మార్పు రావాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల పై పూర్తి స్థాయి అవగాహన కల్పించి యూనిట్ గ్రౌండింగ్ చేయించడం జరుగుతుందని అన్నారు. సిఎం కేసీఆర్ పుట్టిన రోజున ఎంపికైన లబ్ధ్దిదారులతో సమావేశం ఏర్పర్చుకోవడం శుభ సూచకమని అన్నారు. దళిత బంధు పధకంపై మొదట సీఎం కేసీఆర్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశంలో సుమారు 10 గంటలపై సాగిందని, మంత్రి ఈ సందర్బంగా తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలకు రూ. 200 లక్షల కోట్లతో అమలు చేసేందుకు వెనుకడబోమని మంత్రి ఈ సందర్బంగా స్పష్టం చేశారు. జిల్లాలో త్వరలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా నాలుగు వేల ఒక్క వంద కుటుంబాలకు నియోజక వర్గాల వారీగా దళిత బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దళితులకు గొప్ప అవకాశం అని, యూనిట్ల మంజూరులో నష్టం రాకుండా అధికారులు పూర్తి అవగాహన కల్పించి ఆర్ధిక చేయుతకు తోడ్పాటు అందించాలని అన్నారు. సమావేశంలో భాగంగా జెడ్పీచైర్ పర్సన్, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలపై దళిత బంధు పధకంపై లబ్ధ్దిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్లు యస్.మోహసన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్, సీఈఓ సురేష్, పడీకిరణ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్, సీపీఓ జి. వెంకటేశ్వర్లు, పరిశ్రమల జీఎం తిరుపతయ్య, జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.