Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కషి అభినందనీయమని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ అన్నారు. గురువారం ప్రభుత్వం స్టేడియం ఏర్పాటుకు సంబంధించి రూ.2.51కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 8ఏండ్ల నుంచి పోరాటం చేశామన్నారు. ఇప్పుడు స్టేడియం నిర్మాణం పనులు మొదలవుతున్నాన్నారు. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు, అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కష్ణకిషోర్, మున్సిపల్ చైర్మన్ అల్లం పెళ్లి నరసింహ, జెడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, రాపోలు నిరంజన్, పంతులాల్, భాస్కర్ రెడ్డి, చంద్రయ్య,ఉమా మహేష్, తాళ్ల సురేష్, శేఖర్, క్రాంతి, చందు, రాక్ స్టార్ రమేష్, కొండల్, రాజు, పౌల్ రాజు, జగన్ పాల్గొన్నారు.