Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి
నవతెలంగాణ -చిట్యాల
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాల్సి ఆవశ్యకత ఏర్పడిందని శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిట్యాల పట్టణ శివారులో గల తన వ్యవసాయ క్షేత్రంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ జడల ఆది మల్లయ్య తో కలిసి మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ధి పథంలో దూసుకు వెళుతుందన్నారు, రాష్ట్రాన్ని దేశంలోని అగ్రభాగాన నిలిచిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన నిండు నూరేళ్ల తో ఆయురారోగ్యాలతో ఉండాలని మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. రాష్ట్రంలో దివాలా తీసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ పై వచ్చిన విమర్శలపై సీఎం స్పందించే వరకు కాంగ్రెస్ వారు మేలుకో లేదని ఎద్దేవా చేశారు. బండి సంజరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించేందుకు పోటీ పడుతున్నారని నిచమైన భాషను ఉపయోగిస్తూ వారి స్థాయిని మరిచి పోతున్నారని విమర్శించారు. వీరికి రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధిపైగాని దేశంలో నెలకొన్న పరిస్థితులపైగాని అవగాహన లేదన్నారు . కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు రంగానికి విక్రయిస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులను కేటాయించడం లేదన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏం తెచ్చారు అని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నారు.