Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో రైతు వేదికను గురువారం రాష్ట్ర రైతు వేదిక సమన్వయ సమితి అధ్యక్షులు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించి, కేక్ కట్ చేశారు. గ్రామస్తులకు పండ్లు,మాస్కులు, దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి , జెడ్పీ చైర్మెన్ఎలిమినేటి సందీప్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మెన్ జడల అమరేందర్ , జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ ,జెడ్పీటీసీ బీర్ మల్లయ్య , భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ , మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కంచి మల్లయ్య , పిఎసిఎస్ చందుపట్ల మాజీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి , గ్రామ సర్పంచ్ చిన్నం పాండు, రాష్ట్ర నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు , మండల పార్టీ అధ్యక్షులు జంగా పాండు , మండల వైస్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ గౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ వెంకట్ గౌడ్, ఎంపీటీసీ కొండల్ రెడ్డి పాల్గొన్నారు.