Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ పట్టణంలో రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్నా పేదలపై వేస్తున్న భారాలను నిరసిస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య కోరారు. గురువారం తోపుడు బండ్లు, ఫుట్ పాత్ డబ్బాల, చిరు వ్యాపారుల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ముట్టడి కరపత్రాలను ప్రకాశం బజార్లో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 30న మున్సిపల్ కౌన్సిల్ లో తై బజార్ పేరుతో ఫుట్ పాత్ డబ్బాలు, తోపుడు బండ్లు ,రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రోజుకు 50 నుండి 100 రూపాయలు వసూలు చేయాలని తీర్మానించడం అత్యంత దుర్మార్గమైన చర్యన్నారు. అధికారపక్ష టీిఆర్ఎస్తో కాంగ్రెస్, బీజేపీ ,ఎంఐఎం సభ్యులు కూడా మద్దతు తెలియజేస్తూ తీర్మానం చేసి పేదలపై భారాలు మోపడానికి ఏకమయ్యారని ఆరోపించారు. పేదలు చిరు వ్యాపారుల పక్షాన అక్రమ వసూళ్లకు వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే మున్సిపల్ కార్యాలయం ముట్టడికి నల్లగొండ పట్టణంలోని అన్ని రకాల చిరువ్యాపారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.