Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి సహకారంతో మెరుగుపడనున్న 23వ వార్డు దుస్థితి
నవతెలంగాణ-సూర్యాపేట
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశానుసారం మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి ఆధ్వర్యంలో పట్టణం సుందరీకరణగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా 23వ వార్డు రాజీవ్‌నగర్ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో సూర్యాపేట మున్సిపాలిటీ విశేష కషి చేస్తోంది. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపాలిటీ క్రియా శీలకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా పట్టణంలో బర్లపెంట బజార్ ప్రాంతం ఎన్నో ఏండ్లుగా ఎలాంటి అభివద్ధికి నోచుకోని పరిస్థితుల్లో మంత్రి సహకారంతో దళితవాడ ప్రజలకు నేనున్నా అంటూ దళితులకు స్కూల్, స్మశానవాటికలు కట్టించారు.వార్డు సమీపంలోని పుల్లారెడ్డి చెరువు మరో మినీ ట్యాంక్ బండ్‌గా అందించనున్నారు. ఇది దళితవాడకే కాదని,నేను, నా వాడ అనే తీరుగా మంత్రి 23వ వార్డ్ రాజీవ్‌నగర్‌ను తీర్చిదిద్దు తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం కమిషనర్ రామాను జులరెడ్డి కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌నగర్‌లోని ఎడ్ల గోపయ్య విగ్రహంచౌరస్తా వద్ద అధికారులు,సిబ్బంది కొలతలు వేసి గుర్తులు పెట్టారు.రాజీవ్‌నగర్ చౌరస్తా నుండి మాజీ శాసన సభ్యులు ఎడ్ల గోపయ్య విగ్రహం వరకు రోడ్ల సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు.కూడళ్ల సర్కిల్ మధ్యలో ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఫౌంటేషన్ పరిసర ప్రాంతం చుట్టూ పూల మొక్కలు,గ్రీనరీ ఏర్పాటు చేసి విద్యుత్‌కాంతులతో జంక్షన్లు అభివద్ధి జరగనున్నాయి.23 వార్డు కౌన్సిలర్ వల్దాస్ సౌమ్యజానీలు తీసుకున్న చొరవతో రాజీవ్‌నగర్‌లో ఉన్న పలు చౌరస్తాలు నగరస్థాయిని మించి జిలుగువెలుగులతో సంతరించుకోనుంది.