Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలంలోని కూచిపూడి గ్రామంలో ప్రధాన రహదారి గుంతల మయంగా మారిందని, వెంటనే గుంతలను పూడ్చివేయాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రధాన రహదారిపై సిమెంట్ పరిశ్రమలకు చెందిన లారీలు అధికలోడ్‌తో వెళ్లడంతో గుంతలు ఏర్పడుతు న్నాయన్నారు.అనేకమార్లు ఈ గుంతలో పడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదాల నివారణకు అనేక పర్యాయాలు సర్పంచ్ గుంతలలో డస్ట్, మట్టి పోయించినా ఫలితం మారలేదన్నారు.దీనికి ఆర్అండ్బీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఎన్ని సార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగామన్నారు.దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచి పోయాయి.విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, మండల ప్రధానకార్యదర్శి శెట్టి సురేష్‌నాయుడు,సొసైటీ డైరెక్టర్ గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు షేక్ అబ్దుల్నబీ, చాప తిరుపతయ్య, పసుపులేటి రమణయ్య, శెట్టిరమేష్,సయ్యద్మోహిన్, కొలిశెట్టిరామయ్య, శెట్టిగోపి, పసుపులేటి నాంచారయ్య, రెడ్డిపూడి తిరుపతయ్య,చందర్రావు, వినరు, మోహన్ రావు,గోవిందరావు,పూర్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.