Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా తొమ్మిది మంది నాటు సారాయి తయారీ దారులు పట్టుబడ్డారు. వీరిని పాలకీడు మండల రెవెన్యూ అధికారి ముందు వారిని పోలీసులు బైండోవర్ చేశారు.తనిఖీల్లో దొరికిన సారాయి పానకం డ్రమ్ములను పోలీసులు ధ్వంసం చేసి పారబోశారు. తొమ్మిది మందిలో సీఆర్పీసీ సెక్షన్ 109 ప్రకారం రమావత్ పార్వతి, శూన్యపాడు, వడిత్య శౌరి, వడిత్యారాధ,లు పాడ్యాతాండా, మాలోతు లక్ష్మి, నగర వెంకటి, కలమెట్తండావాసులుగా గుర్తించారు.సీఆర్పీసీ 110 సెక్షన్ ప్రకారం ధీరావత్ రవి, రమావత్ శంకర్, రమావత్ శ్రీనులను శున్యపహాడ్ వాసులుగా గుర్తించారు.వారిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ ఎస్సై తెలిపారు.