Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రొఫెసర్ టి.కృష్ణారావు
నవతెలంగాణ-నల్లగొండ
విద్యార్థులు సామాజిక భద్రతను కలిగి ఉండాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ''స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ 2021-22'' అనే కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలోని రైల్వే స్టేషన్లోనూ, బస్టాండ్ వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చీపుర్లతో ఊడ్చి చెత్తను తొలగించారు. పిచ్చిచెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతను కలిగివుండాలని , కేవలం చదువుకోవడం ఒక్కటే కాకుండా సమాజంలోని ఒక పౌరుడిగా తన వంతు బాధ్యతలు నిర్వహించాలని కోరారు. తరచుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేత ప్రజలకు అవసరమైన వంటి పనులను నిర్వహించాలని కోరారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఎన్ఎస్ఎస్ విభాగాలు స్వచ్ఛత యాక్షన్‌ప్లాన్ అనే కార్యక్రమం కింద తమ తమ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కిందవున్న నూట అరవై మూడు ఎన్నెస్సెస్ విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయని, రెండు వందల యాభై మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వివిధ కళాశాలలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రీజినల్ ఆఫీసర్ సంజయ్‌కుమార్, రైల్వేస్టేషన్ మాస్టర్ సుధాకర్‌రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్, సైన్స్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ మారేశ్వరరావు, ఎన్జీ కళాశాల పీఓ యాదగిరిరెడ్డి, సిద్ధార్థ కళాశాల పీవో నరేష్, కాకతీయ కళాశాల పీవో వెంకటేష్, నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల పిఓ అశోక్, కె.లక్ష్మి, నల్లగొండ పట్టణంలో గల వివిధ డిగ్రీ పీజీ కళాశాలల నుండి వచ్చిన రెండువందల యాభై మంది వాలంటీర్లు పాల్గొన్నారు.