Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో ఉస్మానియా మజీద్లీజ్ దారులకు అనుకూలంగా వక్ప్‌బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పలువురు ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుల ఎండి.అజీజ్భాషా, ఎస్కె.మస్తాన్, ఎస్కె.జాని మాట్లాడారు.మజీద్ కమిటీ దుకాణాలలో ఆక్రమణదారులను తొలగించాలని 28 రోజులుగా వివిధ రకాలు తమ నిరసన తెలియజేస్తున్నప్పటికి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుతం ఉన్న దుకాణాదారులు తొలగించి కొత్తగా వేలంనిర్వహించి ఆదాయం వచ్చే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎండి అబ్దుల్ రహీం, ఎస్కెజజాని,ఎస్కె.మస్తాన్ పాల్గొన్నారు.
'నవతెలంగాణ' ఎఫెక్ట్