Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
మిషన్ భగీరథపథకంలో భాగంగా చేపట్టిన వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా క్లీన్ చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు పోటాపోటీగా సంభా షణలు జరిగాయి.మండల సమావేశం ప్రారంభం కాగానే ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య మిషన్ భగీరథ పథకం ఏఈ ని మాట్లాడమనగా ఆయా గ్రామాల సర్పంచులు ఒక్కసారిగా లేచి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లలో పురుగులు, క్రిమికీటకాలు లాంటివి వస్తున్నాయన్నారు.వాటర్ తాగాలంటే భయమేస్తుందని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు తెలియపరచి నప్పటికీ ఒక్కసారి కూడా పరిశీలన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాలలో సర్పంచులను ప్రజలు వాటర్ విషయంలో నానా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.కొత్తగా కొన్ని బజార్లకు కరెంటులైన్లు,స్తంభాలకు తీగలు లాగడం లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, ఎంపీడీఓ ఈదయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎస్కె.జానిమియా, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.