Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
మొక్కల సంరక్షణలో జాప్యం చేయొద్దని జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పెంటయ్య అన్నారు.మండలంంలోని వసంతపురం గ్రామపంచాయతీలో గ్రీవెన్స్ ఫిర్యాదుపై శుక్రవారం ఆయన విచారణ చేపట్టారు.విచారణకు సంబంధించి పల్లెప్రకతివనంలో జరిగిన పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి వాటికి సంబంధించిన బిల్లులు ,చెల్లింపులపై గ్రామపంచాయితీ కార్యాలయములో వివరాలను పరిశీలి ంచారు.సంబంధిత బిల్లుల అసంపూర్తి దస్త్రాలపై మూడు రోజుల్లో ఆధారలతో కూడిన వివరణ సమర్పించడానికి పంచాయితీకార్యదర్శికి, టెక్నికల్ అసిస్టెంట్‌కు మూడు రోజుల గడువు ఇచ్చినట్టు తెలిపారు.అనంతరం వాయిలసింగారం గ్రామంలో నర్సరీలను సందర్శించారు. మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేస్తున్న గ్రీన్షెడ్నెట్ పనులను పరిశీలించారు.నర్సరీలో కనీస మౌలికవసతులైన నీటిట్యాంక్ దిమ్మె, మొక్కల పేర్లు తెలియజేశారు. బోర్డులు,నర్సరీ నిర్వహణ రిజిస్టర్లు,ఎండనుండి మొక్కల సంరక్షణకు గ్రీన్షెడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ నాగేశ్వరరావు, ఏపీఓ శైలజ, టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి ,పంచాయితీ కార్యదర్శిలు మౌలానా,గురులక్ష్మి పాల్గొన్నారు.