Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందాలు ప్రారంభం
అ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు ప్రత్యేకపూజలు
అ జాతరకు పోటెత్తిన జనం
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలపరిధిలోని చీదేళ్ళ గ్రామంలో కొనసాగుతున్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామిల జాతరకు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం హాజరయ్యారు.జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దులపందాలను మంత్రి ప్రారంభించారు.అంతకుముందు ఆలయం ప్రత్యేకపూజలు చేసి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు గ్రామంలో ప్రతీ ఒక్కరికీ కలగాలని అమ్మవారిని కొరుకున్నట్లు తెలిపారు.అంతరించి పోతున్న ఒంగోలు జాతి పశు సంపదను పరిరక్షణకు గ్రామీణ ప్రాంతంలోని ప్రతిఒక్కరూ కషి చేయాలని కోరారు.అనంతరం జాతరకు వచ్చిన చిన్నారులు, యువకులు మంత్రితో సెల్ఫీ దిగడానికి పోటీలు పడుతుండడంతో వారిని నిరాశ పరచకుండా గంట సేపు సమయం వెచ్చించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, పీఏసీఎస్చైర్మెన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, పెద్దగట్టు డైరెక్టర్ ఆవుల అంజయ్యయాదవ్, టీిఆర్‌ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షుడు గుర్రం అమతారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ దాచేపల్లి భరత్, అనాపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మసారాం సర్పంచ్ బొబ్బయ్య, మిరియాల వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారావు, గ్రామఅధ్యక్షుడు వెంకట్రావు, పందుల నాగరాజు పాల్గొన్నారు.