Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని గ్రామీణ ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్లనగేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం అరిబండి భవనంలో నిర్వహించిన పార్టీ మండలకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.నేరేడుచర్ల నుండి దాచారంవరకు రోడ్డు చాలా ఆధ్వానంగా ఉందన్నారు.పెద్దగుంతలు ఏర్పడడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.సుమారు పదేండ్ల కింద గ్రామీణప్రాంత పంచాయతీ రాజ్రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేశారే తప్ప అప్పటినుండి మరమ్మతులే చేపట్టలేదన్నారు.ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకుని వెంటనే పూర్తిస్థాయిలో రోడ్డును నిర్మించాలని కోరారు.రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అట్లాగే మండలంలోని చిల్లేపల్లి నుండి కల్లూరు అడ్డరోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని కమలానగర్ నుండి మేడారం,బక్కయ్యగూడెం వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మామిడి నాగసైదులు, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, మండల కమిటీ సభ్యులు మర్రి నాగేశ్వర్రావు,కట్టమధుబాబు, మచ్చ సోమయ్య, చలసాని అప్పారావు,పాలకూరి రాములమ్మ, డి.రాధమ్మ,అల్వాల శ్రీధర్, బుడిగె ధనుంజయ పాల్గొన్నారు.