Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
నాటుసారా, బెల్లం పటిక పాత కేసులను తిరగతొడుతూ పాత కేసులకు తహసీల్దార్ ఎదుట లక్షరూపాయలు కట్టాలని బైండోవర్ చేస్తూ అమాయక గిరిజనులపై దాడులు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న ఎక్సైజ్ అధికారుల వైఖర్ని ఖండిస్తూ లంబాడీ హక్కులపోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ భిక్షంనాయక్ అధికారులపై మండిపడ్డారు.శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా అమ్మే గిరిజనులకు పునరావాసం పేరిట ,ప్రభుత్వం సహాయం చేయకుండా ఉపాధి చూపకుండా తప్పుదోవ పట్టించి రూ.లక్షలు జరిమానా కట్టాలని చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు.కరోనా సమయంలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులపై దాడులు చేస్తూ జైలుపాలు చేయడం ఎంతవరకు న్యాయమని అధికారులు పునరాలోచన చేయాలన్నారు.జైలుకు పంపించిన వారిని వెంటనే బేషరతు గా విడుదల చేయాలని జరిమానా కట్టించే పద్ధతిని మానుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వైన్‌షాపుల లోపంపై దష్టిపెట్టి బెల్ట్ షాపులు రద్దు, సిండికేట్ నకిలీ మందు తయారీని అరికట్టి చట్ట విరుద్ధంగా నడుస్తున్న వైన్షాప్లపై దాడులు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచే పని చేయాలని కోరారు.