Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీ రామానుజుల స్వర్ణవిగ్రహాన్ని ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ ఆవిష్కరించిన మరుసటి రోజే మహా సంప్రోక్షణపేరుతో ఆ విగ్రహాన్ని శుద్ధి చేయడమంటే దళితుడైన రాష్ట్రపతి విగ్రహాన్ని ముట్టుకోవడం తట్టుకోలేకనే చినజీయర్ స్వామి పాటించిన కులవివక్షను తీవ్రంగా ఖండింస్తున్నామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఆయన మాట్లాడుతూ స్టాట్యూ ఆఫ్ ఇక్వాలిటీ పేరుతో జరిగిన రామానుజ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రపతికే కులవివక్ష, అవమానం జరగడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రపతిని విగ్రహావిష్కరణ పేరుతో ఆహ్వానించి ఆయన చేత విగ్రహాన్ని ఆవిష్కరించి మరునాడు మహా సంప్రోక్షణ ముసుగులో శుద్ధి చేయడంపై వివరణ ఇవ్వాలని కోరారు.గతంలో అయోధ్యలో రామ మందిర భూమిపూజ సందర్బంగా ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌షాలు ఎర్రతీవాచిపై నడిస్తే రాష్ట్రపతి పక్కన మట్టిపై నడిచారన్నారు.ఇటీవల సమాతమూర్తి విగ్రహం వద్ద నిర్వహణ కోసం ఉద్యోగాల కోసం విడుదల చేసిన పేపర్లో దళితులు కేవలం బాత్రూమ్లు శుభ్రం చేయడానికి,ప్రాంగణం బయట ఊడ్చడానికి, సెక్యూరిటీ గార్డులుగా పని చేయడానికి మాత్రమే ఎస్సీలుగా ఉండాలని కులాల వారీగా విభజించిన చినజీయర్‌కు సమతా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.కులవ్యవస్థ చాలా గొప్పదని మాంసాహరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి మొత్తం అసమానతలు,అవమానాలే లక్ష్యంగా సమతమూర్తి ఉత్సవాలు జరిపారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.