Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇంజనీరింగ్ బందాలు ముందుగా పాఠశాలలు సందర్శించాలి
అ చేపట్టే పనులపై తనిఖీలు ఉంటాయి
అ అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మన ఊరు...మనబడి పధకంలో మొదటిదఫాగా సూర్యాపేట జిల్లాలో 329 పాఠశాలలు మౌలిక వసతులకల్పనకు ఎంపిక కావడం జరిగిందని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనపై నిర్వహించిన సమావేశంలో అదనపుకలెక్టర్లు ఎస్.మోహన్‌రావు, పాటిల్హేమంత్కేశవ్లతో కలిసి మాట్లాడారు.ప్రభుత్వం మొదటి దఫాలో జిల్లాలోని 329 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తించిందన్నారు.పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు,ఈడబ్య్లూ, ఐడీసీ శాఖల ఇంజనీరింగ్అధికారులు ముందస్తుగా పాఠశాలలను సందర్శించి వాటి వాస్తవస్థితిగతులను పరిశీలించి నివేదికలు అందచేయాలని సూచించారు.పాఠశాలల మరమ్మతులకు ముందుగా సరిపడా ఇసుక అందిస్తామన్నారు.అలాగే మిషన్ భగీరథ ద్వారా పాఠశాలలలో తాగునీటి ట్యాంక్ వరకు పైపులైన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధిహామీ చట్టం ద్వారా మరుగుదొడ్లు, చికెన్షెడ్స్, ప్రహరీ చేపట్టేందుకు అవకాశం ఉందని, ఆదిశగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పాఠశాలలలో చేపట్టే పనులపై ముందుగా స్థానిక శాసన సభ్యుల వద్ద సమయం తీసుకొని పనుల వివరాలను తెలియచేయాలన్నారు.నాలుగు నియోజకవర్గాలలో చేపట్టే పనులను, ముందుగా అలాగే పనుల అనంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు.అన్ని పాఠశాలలలో పనుల అనంతరం గొప్ప మార్పు కనబడాలని ఆదిశగా అధికారులు, ఇంజనీర్లు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు.ఎస్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని చేపట్టాల్సిన పనులపై సమీక్షించుకోవాలని సూచించారు.రాష్ట్ర స్థాయిలో పాఠశాలలో మౌలికవసతుల కల్పన కోసం ప్రభుత్వం రూ.7289 కోట్లు అంచనా బడ్జెట్ రూపొందించిందన్నారు.2021-22 ఆర్ధిక సంవత్సరానికి మొదటి దఫాలో రాష్ట్రంలో 9123 పాఠశాలకు గాను 35 శాతం మేరకు పనులు చేపట్టడంలో భాగంగా మన జిల్లాలో 329 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు.మౌలికవసతుల కల్పనలో భాగంగా చేపట్టే పనులు ఎస్ఎంసీ కమిటీ తీర్మానం ప్రకారమే చర్యలు చేపట్టాలని సూచించారు.అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ద్వారా జమయ్యే నిధులకు అలాగే దాతలు అందించే విరాళాలకు వేర్వేరు ఖాతాలు ఉండాలని సూచించారు.ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి నిబంధనల మేరకు తొలగిస్తామన్నారు.వాటి స్థానంలో కొత్త భవనాలు చేపడ్తామన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి వర్యులు సూచించిన విదంగా మౌలికవసతులకల్పనలో భాగంగా ఎంపికైన పాఠశాలలలో మొదటి ప్రాధాన్యతగా బాల, బాలికలకు వేరుగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు.అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలలో నిర్దేశించిన 12అంశాలపై అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, పాటిల్హేమంత్కేశవ్ సంబంధిత అధికారులకు, ఇంజనీర్లకు సవివరంగా వివరించారు.ఈ సమావేశంలో డీఈఓ అశోక్,ఆర్అండ్బీ ఈఈ బి.యాకుబ్, డీఈ మహిపాల్‌రెడ్డి, ఈడబ్య్లూఐడీసీ రమేశ్, ఏఈలు పాల్గొన్నారు.