Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మొక్కలు పెంచుకుందాం... పర్యావరణాన్ని కాపాడుకుందామని టీిఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు సర్పంచ్ పుట్ట గురువేందర్ అన్నారు.శుక్రవారం గ్రీన్ డే సందర్బంగా కలెక్టర్ వినరుకష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం అక్కలదేవిగూడెం గ్రామంలో హరితహారం కింద విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా నాటిన మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌తో ఎంపీవో గోపి తో కలిసి టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సర్పంచ్ పుట్ట గురువేందర్ నీళ్లుపోశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట గురువేందర్ మాట్లాడుతు వేసవి కాలం ప్రారంభమవుతున్నందున పెరుగుతున్న ఉష్నోగ్రతలకు మొక్కలపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.మొక్కలతో గ్రామం మొత్తం హరితశోభను సంతరించుకుందన్నారు.ఖమ్మం రోడ్డు వెంట బహుళవరుసలలో నాటిన మొక్కలపట్ల సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో, నిత్యం హరితహారం మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎంపీవో గోపి అభినందిస్తూ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఇలా మొక్కల సంరక్షణ కు గ్రామ పంచాయతీలు చర్యలు తీసు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.