Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అ మొదటి విడతగా 240 ప్లాట్ల వేలం
నవతెలంగాణ-నల్లగొండ
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామ పంచాయతీ నార్కట్ పల్లి-అద్దంకి స్టేట్ హైవే పక్కన ఉన్న రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో ఓపెన్ ప్లాట్ లను మార్చి 14,15,16,17 తేదీ లలో భౌతిక వేలం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో రాజీవ్ స్వగహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లపై ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా 240 ఓపెన్ ప్లాట్లను మార్చి 14,15,16,17 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం ప్లాట్ నంబర్ ల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 7వ తేదీన మళ్లీ ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అరుదైన అవకాశం అని, భూ వివాదాలు, తగాదాలు లేని ఎన్ కంబారెన్స్ ఫ్రీ ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఇందులో 33 ప్లాట్లు మల్టిఫుల్ వినియోగానికి లే అవుట్ లో విభజించినట్లు తెలిపారు. నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) ఏర్పాటు తర్వాత నుడా పరిధిలో మొదటి సారిగా ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న అరుదైన అవకాశం అన్నారు. డీటీసీపీ ఆమోదిత శ్రీ వల్లి టౌన్ షిప్ లో నిబంధనల మేరకు లే అవుట్ అభివృద్ధి చేయడం జరుగుతుంన్నారు. బ్లాక్ టాప్ రోడ్స్, విద్యుత్ సౌకర్యం, ఇంటర్నల్ ఎలాక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్లు, తాగునీరు, సీవరేజ్ సిస్టం, అవెన్యూ ప్లాంటేషన్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. అప్సెట్ ధర రూ.10 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనాలంటే ఈఎండీ కింద రూ.10 వేలను జిల్లా కలెక్టర్, నల్గొండ పేరున డీడీ తీయాలని అన్నారు. రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్లో సైట్ కార్యాలయం ఓపెన్ చేసినట్లు, లే అవుట్ మ్యాప్, ప్లాట్ నంబర్ల వారీగా డిస్ ప్లే చేసినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ను సందర్శించి ప్లాట్లను పరిశీలన చేసుకోవచ్చని అన్నారు. సయ్యద్ షఫీజుద్దీన్ మొబైల్ నంబర్ 9154339209, రాజీవ్ స్వగృహ ఆఫీస్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చనిఅన్నారు.
http:/nalgonda.telangana.gov.in,
http:/swagruha.telangana.gov.in,
http:/auctions.hmda.gov.in, http:/tsiic.gov.లో లాగిన్ కావాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్నంబర్ 18004251442 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెచ్ఎండీఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీ వల్లి టౌన్ షిప్ మ్యాప్, ప్లాట్ ల వివరాలు, వేలం పద్ధతి పై వివరించి హాజరైన ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీఎం శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.