Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్
అ హిజాబ్‌పై ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయకపోతే గహ సముదాయాలను బుల్డోజర్లతో కూల్చివేస్తామని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ డిమాండ్ చేశారు. వస్త్రధారణ (హిజాబ్) పేరుతో ముస్లిం అమ్మాయిల చదువుకు దూరం చేయాలని చూస్తున్న మతోన్మాద చర్యలను ఖండిస్తూ శుక్రవారం మండలకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఆవాజ్ జిల్లా నాయకులు ఎంఎ.ఇక్బాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రజల మధ్య ఘర్షణలు సష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు తన పరిపాలనలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించామని, దేశాన్ని ఎంత అభివద్ధి చేశామని చర్చ జరగకుండా ఘర్షణ వాతావరణం సష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ సమస్యను రెచ్చగొట్టి ముస్లిం మహిళలు విద్యకు దూరం చేయాలని తద్వారా తాను అమలు చేయాలనుకున్న మనువాద చట్టాన్ని ఆచరణలో పెట్టాలని చూస్తుందన్నారు. హిందూ మతోన్మాద సంస్థలు ప్రజలను రెచ్చగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాల రాయాలని చూస్తున్నాయన్నారు. బీజేపీ తన పరిపాలన ద్వారా దేశాన్ని మధ్యయుగాల నాటి పరిస్థితులకు తీసుకు వెళుతుందన్నారు. ప్రజలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడుతుంటే పాలకులు ప్రజల దష్టిని మరల్చి దేశ సంపదను ఆదాని ,అంబానీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇలాంటి వాళ్ళను ఇంకా కొద్ది కాలం అధికారంలో ఉండనిస్తే దేశ సంపదను కొల్లగొట్టి నాశనం చేస్తారని, భవిష్యత్ తరాలు అంధకారమవుతాయని అన్నారు. మున్సిపల్ చైర్మెన్‌్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ దేశంలో ప్రజలు కులమతాలు వర్గాలుగా విడిపోకుండా ఐక్యమత్యంతో ఉండి దేశాభివద్ధికి పాటుపడాలని కోరారు . నచ్చిన ఆహారం తినే హక్కు ,తనకు నచ్చిన విధంగా దుస్తులు ధరించే హక్కు అంబేద్కర్ ద్వారా భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందన్నారు. ఎంతో కాలం చదువుకు దూరమైన మహిళలు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి చదువు సంధ్య నేర్చి దేశ ఆర్థిక అభివద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారన్నారు. హిజాబ్‌పై కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో జరుగుతున్న సంఘటనలను ప్రజాసంఘాలు ,వివిధ పార్టీల నాయకులు ఖండిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశం లో డీివైఎఫ్‌ఐ నాయకులు చిన్న రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు కాసుల నరేష్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మోడీగాడి చంద్రశేఖర్, టీిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం ,కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ ఎండి.జైన్ఉద్దీన్, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఎండి.రియాజ్ ,సీపీిఐ ఎంఎల్ నాయకులు పద్మ సుదర్శన్ , ఇక్కీరి కుమార్, రజక సంఘం నాయకులు వడ్డెమాను శ్రీనివాసులు ,టీిఆర్‌ఎస్ నాయకులు ఎస్.సంతోష్ ,ఎండి.ఫయాజ్, ఎండ.ి షాబుద్దీన్, వెంకటయ్య, బీఎస్పీ నాయకులు తుంగ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు లోకేష్ ,ప్రైవేటు ఉపాధ్యాయులు యాకోబు, ఆవాజ్ జిల్లా నాయకులు ఎండి .బద్రు ,ఎండి.సలీం ,ఎండి.గౌస్, తాజ్ ,షకీల్, పీడీఎస్‌యూ నాయకులు హర్షిత్,నిషాంత్ ,వడ్డేమాన్ విప్లవు, మొరిగాడి పథ్వీ, ఎండి.రసూల్, తదితరులు పాల్గొన్నారు.