Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని ఇటుక బట్టీలలో గల వర్క్ సైట్ స్కూల్ ను శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి ఒడిశా విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు బ్యాగులు ,నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లోని గర్భిణులు, చిన్నారులను సందర్శించి వారికి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కష్ణవేణి, సీడీపీఓ స్వరాజ్యం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు, తహసీల్దార్ మీరాబాయి, ఎంపీడీఓ ిఓ బాల శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, కౌన్సిలర్ రజిత,ఎన్సీఎల్పీ డైరెక్టర్ కుమారస్వామి, సూపర్వైజర్లు అంజమ్మ, ఊర్మిళా, అవుట్ రీచ్వర్కర్ దశరథ, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ పమేలాస్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల కన్వీనర్ మంచాల మధు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడం లేదన్నారు. దానిద్వారా బిల్లులు రాక అప్పులు చేసి కూరగాయలు నిత్యావసర సరుకులు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ ప్రసాదం విష్ణు ,కార్మికులు అంజమ్మ ,లక్షమ్మ ,తదితరులు పాల్గొన్నారు.