Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి:అభివద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో జోరుగా చేరికలు జరుగుతున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.శుక్రవారం తన నివాసంలో మండలకేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కొండగడుపుల వినోద సైదులు, వార్డు సభ్యులు సరిత, ఆంధ్రయ్య,అరుణ,శాంతయ్య, వీరయ్య, కష్ణ, నర్సింహతో పాటు 50 మంది నాయకులు టీిఆర్‌ఎస్ చేస్తున్న అభివద్ధి సంక్షేమపథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ టీిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు అందాయన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరి ఏఇతర రాష్ట్రాలలో లేవని దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని, తుంగతుర్తి ఎంపీటీసీ సజన పరమేష్, వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.