Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
వీఆర్ ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 22న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.ధర్నాను విజయవంతం కోసం ఆదివారం పట్టణంలో వీఆర్ఏలతో కలిసి ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 09న శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఏలకు పే-స్కెల్ ఇస్తామనానరు.సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు.ప్రమోషన్స్ ఇస్తామని,వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 22న ఇందిరాపార్క్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు.వారి హక్కుల సాధన కోసం నిర్వహించే ధర్నాలో వీఆర్ఏ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం(వీఆర్ఏ) జిల్లా సలహాదారు ఎన్.గిరిరావు, ఆలేరు మండల ప్రధానకార్యదర్శి బొమ్మేళ్ల శ్రీనివాస్,కసాగళ్ల సురేష్, పార్శ బంగారయ్య, నేతకాని కార్తీక్, వెంటుక వెంకటేష్, ఎస్కె.ఆషిఫ్ పాల్గొన్నారు.