Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడివెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం మండలకేంద్రంలో చలో హైదరాబాద్ పోస్టర్ను ఆయన విష్కరించి మాట్లాడారు.వీఆర్ఏలకు పేస్కేల్, పీఆర్సీ జీఓలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో చనిపోయిన వీఆర్ఎలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరారు.ఈ నెల 22న హైదరాబాద్ జరిగే ధర్నాలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, తెలంగాణ రిక్రూట్ మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘంల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి ఇచ్చిన పిలుపులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోళ్ల భాషయ్య, మండలం అధ్యక్షులు ఎడ్ల వెంకన్న, మాదాసు నర్సింహ,జాని, జనకశంకరయ్య, రాములు, యాదయ్య, రాములమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.