Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడుచర్ల:నేరేడుచర్ల నడిబొడ్డున ఉన్న రావిచెట్టును ఆదివారం ఓజో ఫౌండేషన్ చైర్మెన్ పిల్లుట్ల రఘు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 100 ఏండ్లపైబడి చరిత్ర కలిగిన రావిచెట్టును రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించడం బాధాకరమన్నారు.చరిత్ర కలిగిన చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రావిచెట్టు రీప్లాంటేషన్ కోసం తన సహకారం పూర్తిగా ఉంటుందన్నారు.సరైన స్థలం చూపిస్తే రావి చెట్టు రీప్లాంటేషన్ చేయడానికి ఓజో ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్, శ్రవణ్, బబ్లూ, నాగరాజు, విజరు, సలీం, రవి, మధు, మల్లికార్జున్, సందీప్, నవీన్ పాల్గొన్నారు.