Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న మినీఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మున్సిపల్ నాయకులు డిమాండ్‌చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు మినీస్టేడియాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు బండారు నర్సింహా, ఎమ్‌డి.పాషా, బత్తుల శ్రీశైలం మాట్లాడారు.పట్టణంలోని 171 సర్వేనెంబర్లో స్టేడియం నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే పనులు నిలిపివేశారని తెలిపారు. యువత స్టేడియం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.అసంపూర్తిగా ఉన్న స్టేడియం పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని డిమాండ్‌చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్‌డి.ఖయ్యుమ్, గంజి రామచంద్రం, ఎర్ర ఊషయ్య, ఏనుగుల యాదయ్య, తిరందాసు దయాకర్, మొగుదాల గణేశ్, బండారు విక్రమ్ పాల్గొన్నారు.