Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూరు
మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) ఆవరణలో దేవ్ రిత్విక్ అర్థోపెడిక్,,ట్రామసెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరాన్ని గ్రామసర్పంచ్ ఆడేపు విజయస్వామి ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవ్రిత్విక్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.గ్రామస్తులకు సేవలందిస్తున్న డాక్టర్ రిత్విక్, వైద్య బందానికి కతజ్ఞతలు తెలిపారు.డాక్టర్ రిత్విక్ మాట్లాడుతూ పల్లెపల్లెలో వైద్యమందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహి స్తున్నామని,శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.అలాగే భువనగిరి పట్టణంలోని రాధాకృష్ణమూర్తి ఆస్పత్రి పక్కన గంజ్ వద్ద మాదేవ్ రిత్విక్ అర్ధోపెడిక్, ట్రామసెంటర్ ఉందని అక్కడ ప్రతి సోమవారం ఉచితంగా సేవలందిస్తున్నా మన్నారు.ఎముకల బలహీనత, కీళ్ల వాతం, మోకాళ్ల అరుగుదలకు విస్ఫోసప్లిమెంటేషన్ చికిత్స, నడుమునొప్పికి ఆపరేషన్ లేకుండా నర్వుబ్లాక్తో చికిత్స చేయడం మా ప్రత్యేకతలన్నారు.మొత్తం 235 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిం చామన్నారు.అనంతరం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులను డాక్టర్ రిత్విక్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాడిపతిభ, డాక్టర్ పి.రిత్విక్ (ఎంఎస్ ఆర్ధోసర్జన్), డాక్టర్ పంతుల భూపాల్, క్యాంప్ కోఆర్డినెటర్ ఎన్.కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు గంగరబోయిన రమేశ్, గ్రామస్తులు బొడిగే భిక్షపతి, బచ్చే బీరప్ప, పన్నీరు భరత్, వైద్యబందం శ్రీకాంత్, సాయి, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.