Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
డిజిటల్ యూనివర్శిటీ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వాహనం రాజు డిమాండ్చేశారు.మండలకేంద్రంలో ఆ సంఘం మండల 31వ మహాసభ వీఆర్ జూనియర్ కళాశాలలో కంతి విక్రమ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రం ఏ ఏడాదికాడేది విద్యారంగాన్ని విస్మరిస్తూనే ఉందన్నారు. ప్రతిబడ్జెట్లో లాగానే విద్యా సంవత్సరం కూడా అది నిరూపితమైందని చెప్పారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి అరకొర కేటాయింపులు జరిపిం దన్నారు.ఈ కేటాయింపులు విద్యారంగం అభివద్ధికి ఏమాత్రం సరిపోవని,నూతన విద్యా విధానంతో దేశంలో నూతన ఓరవడిని సష్టిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ కటాయింపులు ఏ మాత్రం నూతన విద్యావిధానం లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నారు.ఈ బడ్జెట్ నిధులు కేటాయింపు భవిష్యత్ విద్యారంగాన్ని ప్రయివేట్, కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టే కుట్రలో భాగంగా ఉందన్నారు.డిజిటల్ యూనివర్శీటీ స్థాపనకు కేంద్రం కుట్రలు చేస్తుందని విమర్శి ంచారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు దూపటి వెంకటేష్,జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్,మండల కార్యదర్శి కాసుల నరేష్, మండల నాయకులు కందుల నాగరాజు,కంతి విక్రమ్, ఆలేటి తరుణ్,అప్జల్, ఉల్లోజు చాణిక్య, కొరుటూరి కార్తీక్, శనిగారం మణికాంత్, ఉదరు కుమార్, బండి శిరీష, నోముల శిరీష, తోట రుషికేశ్, సంధ్య పాల్గొన్నారు.