Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీని జిల్లా అధ్యక్షులు వనం రాజు ఆధ్వర్యంలో ఎన్ను కున్నారు.మండలకార్యదర్శిగా కాసుల నరేశ్, అధ్యక్షునిగా కందుల నాగరాజుతో పాటు మరో 12 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులకు ఆయన శుభాకాక్షలు తెలిపారు.అనంతరం వనం రాజు మాట్లాడుతూ భవిష్యత్లో ఆలేరు ప్రాంతంలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని ఈ కమిటీ నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ,విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివద్ధి కోసం నిరంతరం కషి చేయాల న్నారు.సంఘం ఉపాధ్యక్షులుగా కంతి విక్రమ్, క్రిస్టోఫర్, సహాయకార్యదర్శులుగా శనిగారం మణికాంత్, బండి శిరీష, తోటబుషి కుమార్, కమిటీసభ్యులుగా ఉల్లోజు చాణిక్య, మతలపల్లి జయంత్, కొరుటూరి కార్తీక్, బి.ఉదరుకుమార్, టి.సంధ్య, నోముల శిరీష ఎన్నికయ్యారు.