Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆశాలకు సెల్ఫోన్లు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేసిన ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఆశా కార్యకర్తలు జీతం కోసం గత ప్రభుత్వ పాలనలో అనేక కష్టాలు పడ్డారని, సీఎం కేసీఆర్ మాత్రం ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని జీతాలను రూ.9750 కి పెంచారన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను అందజేసి మాట్లాడారు.కరోనా పరీక్షలు,గర్భిణులకు వైద్యపరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపర్చేందుకు ఆశాలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడమనేది మంచిపరిణామం అన్నారు. నియోజకవర్గంలో 330 మందికి స్మార్ట్ఫోన్లు అందించామన్నారు.జిల్లా వ్యాప్తంగా 1070,రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ఫోన్లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది దేశంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనన్నారు.గత పాలకులు ఆశా సేవలను గుర్తించకపోవడంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొ న్నారన్నారు.వారి సేవలను గుర్తించి తెలంగాణలో రూ.9,750 వేతనం ఇస్తున్నామని తెలిపారు.ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందన్నారు.ఇతరరాష్ట్రాలలో ఎక్కడకూడా ఆశాలకు వేతనాలు రూ.3 నుండి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాండన్ సుదర్శన్,పెన్‌పహాడ్ ఎంపీపీ నెమ్మాదిభిక్షం, సూర్యాపేట జెడ్పీటీసీ జీడీభిక్షం,ఉద్యోగ సంఘం నాయకులు వాంకుడోతు వెంకన్న,వైద్య అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.