Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడ్తాయని జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని మాల్యాల గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ఆయన చెక్కులు అందజేసి మాట్లాడారు.మేడ్చల్ జిల్లా యాద్గార్పల్లి యువకులు మొదటి బహుమతిగా రూ.15 వేలు చేజిక్కించుకోగా మాల్యాల గ్రామ యువకులు రెండవ బహుమతిగా రూ.5వేల చెక్కును చేజిక్కించుకున్నారు.ఈ సంద ర్భంగా జెడ్పీ చైర్మెన్ మాట్లాడుతూ క్రీడలు ద్వారా యువకుల్లో మానసికోల్లాసంతో పాటు శారీరకదారుఢ్యాన్ని పెంచుతాయన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలగాని వెంకటేష్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మెన్ గూదె బాలనర్సింహ, వైస్‌చైర్మెన్ కొండల్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ రామిడి రాంరెడ్డి, చీకటిమామిడి మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మచ్చ శ్రీనివాస్ గౌడ్,యువనాయకులు బోనంకూర మల్లేశం,ఉపసర్పంచ్ జెల్లామల్లేశం, బోనంకూర సుదర్శన్,ఊట్ల నగేష్, టోర్నమెంట్ నిర్వాహకులు దొమ్మాట మహేష్, గుండ సురేష్, నాగరాజు, బేతాల ప్రవీణ్ పాల్గొన్నారు.