Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మండలంలోని ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి-65కు అండర్ పాస్ వే నిర్మించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మనోహర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు రిక్కల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి దాటి ఉన్న వ్యవసాయ భూము లను వెళ్ళడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.పశువులను తోలుకు పోవాలన్న భయాందోళనకు గురవు తున్నారన్నారు. జాతీయరహదారి పై వెళ్లే వాహనాలు వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరిగి మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే నేషనల్ హైవేపై అండర్ వే వేసేలా చూడాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు బాలగోని లింగస్వామి, పోలేపల్లి లక్ష్మయ్య, కొత్తయాదయ్య, బాలగోని నర్సింహ, బాలగోని జంగయ్య,రిక్కల రాంరెడ్డి ఉన్నారు.