Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పద్య సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నాటిక రాష్ట్ర స్థాయి సమాఖ్య అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు మిర్యాలగూడ కళ సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన పల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక వినాయకుడి దేవాలయంలో పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని ద్వితీయ వారోత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డ్‌లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈ పోటీల ప్రదర్శన ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో పద్య నాటికలకు భక్త ప్రహ్లాద (హైదరాబాద్) మహామంత్రి తిమ్మరుసు ( హుజుర్ నగర్), ఊరు భంగం (ఖమ్మం), రుక్మిణి పరిణాయం (హైదరాబాద్), మోహిని బష్మసూద (జడ్చర్ల), 5 నాటికలను, సాంఘిక నాటక పోటీల్లో పాశం (హైదరాబాద్), తింకు (హైదరాబాద్), మౌనర్యని (ఖమ్మం), సాక్షి (హైదరాబాద్), మీకోసం నేను (హైదరాబాద్), పితృవిలపం (కరీంనగర్) పోటీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 11 నాటిక పోటీలు ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. పద్య నాటక పోటీల్లో మొదటి బహుమతి 15000, రెండో బహుమతి 12,000, మూడవ బహుమతి పది వేలు, సాంఘిక నాటక పోటీల్లో మొదటి బహుమతి పది వేలు, రెండో బహుమతి 8000, మూడో బహుమతి 6000 అందజేయనున్నట్టు తెలిపారు. పోటీలో పాల్గొన్న జట్లకు కన్సోలేషన్ బహుమతిగా 15000 అందజేస్తామని చెప్పారు. ఈ నాటిక పోటీల ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి రామావతారం పలువురు సభ్యులు పాల్గొన్నారు.