Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సర్పంచ్..ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం
అ ప్రథమ పౌరునికి అవమానం
నవతెలంగాణ-యాదాద్రి
మండలంలోని పెద్దకందుకూర్‌లో ఆదివారం స్వల్ప పంచాయితీ చోటుచేసుకుంది.గ్రామ సర్పంచ్, సీపీఐ(ఎం) బీమగాని రాములు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వాగ్వాదం జరిగింది.దీంతో అక్కడ జరపాలనుకున్న ప్రారంభోత్సవం కొద్దిసేపు నిలిచిపోయింది.ఏది ఏమైనా జనజీవన ప్రదేశంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణం అవసరం లేదని సర్పంచ్ పట్టుబట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన విధంగా రూ.25లక్షల అభివృద్ధి నిదులతో ఎమ్మెల్యే సునిత గ్రామంలో ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవం చేయబోయారు.గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఇక్కడ నిర్మించాలకున్న ఫంక్షన్హాల్లో డీజే చప్పుళ్లు, తీన్మార్ డ్యాన్స్‌లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సర్పంచ్ విమర్శించారు.ఇండ్ల మధ్యలో ఇలాంటి నిర్మాణాలతో ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామస్తులు కూడా అభిప్రాయపడ్డారు.కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామాభివృద్ధికి వదిలిన 10శాతం భూముల్లో ఊరికి (సుమారు 10 ఎకరాల్లో) దూరాన నిర్మించాలని ఘర్షణ మధ్య సర్పంచ్ పట్టుబట్టారు. కానీ..పోలీసులతో సర్పంచ్‌ను అడ్డుకోజెప్పి..అదేం పట్టనట్టు ఎమ్మెల్యే గొంగిడి సునితా, తన కార్యకర్తల నడుమ టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఇది తగదని చెప్పడానికి వెళ్లిన సర్పంచ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల పక్షాన వినతి అందజేయడానికి రాగా అది అందుకోకుండానే ఎమ్మెల్యే తిరస్కరించారు.దీంతో అటు వినతి తిరస్కరణ, ఇటు ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే తనను అవమానించారని సర్పంచ్ విమర్శించారు. ఇది వరకే ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకుపోయానని, ఇక ముందు సీఎం కేసీఆర్ నేరుగా గ్రామస్తుతో కలిసి సమస్య వివరిస్తానని ఆయన వెల్లఢించారు. అప్పటికి కూడా స్పందించకపోతే ఆందోళన చేపడుతామని సర్పంచ్ ప్రకటించారు.ఈ గ్రామంలో ఎప్పుడు ఇరువర్గాలకు ఘర్షణలు జరగడం, వివాదాలు తలెత్తడం శరమామూలుగా మారిపోయింది. జిల్లాలో ఏకైక సీపీఐ(ఎం) సర్పంచ్ ఉన్న చోట ఇలా ఇబ్బందులు కలిగించడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగదని, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని హెచ్చరించారు.
అభివృద్ధి అంటే ప్రజలకు మేలు చేయాలి
సర్పంచ్ ..బీమగాని రాములు
అభివృద్ధికి ఎవరు అడ్డురారు. కానీ..ఆ అభివృద్ధి ప్రజలకు మేలు చేసేది ఉండాలి.అంతే కానీ ఇష్టారీతిన ప్రారంభోత్సవాలు జరిపి ఇబ్బందులు కలిగిస్తే ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు వెనకాడను.అవసరం లేని చోట నిధులు వెచ్చించి వృథా చేయడం కన్నా గుట్ట నుండి 4కిలోమీటర్ల మేర రూ.50లక్షలతో రోడ్డు వేయండీ. పోనీ..అదే కావాలనుకుంటే ఫంక్షన్‌హాల్‌ను ఊరి బయట నిర్మించండి స్వాగతిస్తాం.