Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అమరవీరుల త్యాగాలు నేటి పోరాటాలకు దిక్సూచి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి మూడో వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జూలకంటిరంగారెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ పేద ప్రజల కోసం పనిచేసి,వారి జీవితాన్ని పోరాటమయం చేసి ,సమాజాన్ని కుటుంబంగా భావించి,పోరాటంలోనే అసువులు బాసిన అమరవీరుల చేసిన త్యాగాలు నేటితరానికి పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి దిక్సుచిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల ఆగడాలనుండి ప్రజలను రక్షించి దున్నేవానికి భూమి దక్కాలనే నినాదంతో జరిగిన మహోత్తర పోరాటమైన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరుడన్నారు.ఆయన జీవితమంతా త్యాగాల మయమేనన్నారు.నిరంతర అధ్యయనం చేసి ప్రజలను చైతన్యవంతం చేసిన విజ్ఞాన గని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ గౌతమ్‌రెడ్డి, రవినాయక్, భావండ్ల పాండు, పోలేబోయిన వరలక్ష్మీ, పగిడోజు రామ్మూర్తి, నాయకులు పాల్గొన్నారు.